Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/38/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 09:03, 6 April 2024 by Vjsuseela (talk | contribs)
  • ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే - వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
  • వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే - వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
  • వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
  • సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులకు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు.
  • అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
  • వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘనకు చట్టపరమైన బాధ్యత అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
  • అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే - అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
  • సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే - టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
  • యు.సి.ఒ.సి.ని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
  • యు4సి నిర్వహిస్తుంది
  • వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు ఏమంటే -
  • యు.సి.ఒ.సి. అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం;
  • యు.సి.ఒ.సి.తో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము;
  • యు.సి.ఒ.సి. అమలు నిరాకరించడం; వనరులు లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం
  • వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
  • బహుళ వికీలలో జరిగే యు.సి.ఒ.సి.ఉల్లంఘనలను ప్రపంచ సిసోప్స్ లు, స్టీవార్డ్ నిర్వహిస్తారు. ఒకే వికీ లోని యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని యు4సి లు నిర్వహించుతాయి
  • ఒకే వికీలో జరిగే యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల అమలుచేసే విధానాలు ద్వారా నిర్వహిస్తారు.
  • విధ్వంసం వంటి సాధారణ యు.సి.ఒ.సి. ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు విధానాలు ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
  • వికీ బయట(ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్ కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు విధానాలు ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ ప్రదేశాలలో అమలు విధానాలు ద్వారా నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
  • వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
    • ఇప్పటికే ఉన్న మార్గదర్శకాలు ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో వివిధ ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
    • ఈ కేసులను నిర్వహించే మార్గదర్శకాల అమలు చేయడానికి వాటిని యు4సికి సూచించవచ్చు
    • వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది