Policy:Universal Code of Conduct/Enforcement guidelines/te: Difference between revisions

From Wikimedia Foundation Governance Wiki
Content deleted Content added
Vjsuseela (talk | contribs)
No edit summary
Vjsuseela (talk | contribs)
No edit summary
Line 8: Line 8:
==సార్వత్రిక ప్రవర్తనా నియమావళి మార్గదర్శకాల అమలు==
==సార్వత్రిక ప్రవర్తనా నియమావళి మార్గదర్శకాల అమలు==


కమ్యూనిటీలు, వికీమీడియా ఫౌండేషన్ ఈ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (యు.సి.ఓ.సి.) లక్ష్యాలను ఎలా సాధించగలవో ఈ మార్గదర్శకాలు వివరిస్థాయి. ఇందులో ఇతర అంశాలతోపాటు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లక్ష్యాలపై అవగాహనను పెంపొందించడం, ఉల్లంఘనలను నిరోధించడానికి చురుకుగా పని చేయడం, ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా సూత్రాలను అభివృద్ధి చేయడం, స్థానికంగా అమలు చేసే విధానాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి.
ఈ విధానాన్ని వికీమీడియా ఫౌండేషన్ ట్రస్టీల బోర్డు ఆమోదించింది.

కమ్యూనిటీలు, వికీమీడియా ఫౌండేషన్ ఈ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (UCoC) లక్ష్యాలను ఎలా సాధించగలవో ఈ మార్గదర్శకాలు వివరిస్థాయి. ఇందులో ఇతర అంశాలతోపాటు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లక్ష్యాలపై అవగాహనను పెంపొందించడం, ఉల్లంఘనలను నిరోధించడానికి చురుకుగా పని చేయడం, ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా సూత్రాలను అభివృద్ధి చేయడం, స్థానికంగా అమలు చేసే విధానాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి.


అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ వికీమీడియా ప్రదేశాలకు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. అందువలన, ఈ నియమావళిని అమలు చేయడం అందరి ఉమ్మడి బాధ్యత. వికేంద్రీకరణ ఉద్యమ సూత్రానికి అనుగుణంగా సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని సాధ్యమైనంతగా సంబంధిత స్థానిక స్థాయిలో అమలు చేయాలి.
అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ వికీమీడియా ప్రదేశాలకు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. అందువలన, ఈ నియమావళిని అమలు చేయడం అందరి ఉమ్మడి బాధ్యత. వికేంద్రీకరణ ఉద్యమ సూత్రానికి అనుగుణంగా సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని సాధ్యమైనంతగా సంబంధిత స్థానిక స్థాయిలో అమలు చేయాలి.

Revision as of 16:43, 28 March 2024

వికీమీడియా ఫౌండేషన్ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి మార్గదర్శకాల అమలు

కమ్యూనిటీలు, వికీమీడియా ఫౌండేషన్ ఈ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి (యు.సి.ఓ.సి.) లక్ష్యాలను ఎలా సాధించగలవో ఈ మార్గదర్శకాలు వివరిస్థాయి. ఇందులో ఇతర అంశాలతోపాటు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లక్ష్యాలపై అవగాహనను పెంపొందించడం, ఉల్లంఘనలను నిరోధించడానికి చురుకుగా పని చేయడం, ఉల్లంఘనలకు ప్రతిస్పందనగా సూత్రాలను అభివృద్ధి చేయడం, స్థానికంగా అమలు చేసే విధానాలకు మద్దతు ఇవ్వడం వంటివి ఉన్నాయి.

అన్ని ఆన్లైన్, ఆఫ్లైన్ వికీమీడియా ప్రదేశాలకు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. అందువలన, ఈ నియమావళిని అమలు చేయడం అందరి ఉమ్మడి బాధ్యత. వికేంద్రీకరణ ఉద్యమ సూత్రానికి అనుగుణంగా సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని సాధ్యమైనంతగా సంబంధిత స్థానిక స్థాయిలో అమలు చేయాలి.

ఈ మార్గదర్శకాలు ప్రస్తుత, భవిష్యత్తు విధానాలు పరస్పర చర్యకు ఒక రూపాన్ని అందిస్తాయి, ఇంకా ఒక స్థిరమైన అమలుకు పునాదిని ఏర్పరుస్తాయి.

1.1 సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అమలు మార్గదర్శకాల అనువాదాలు

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అమలు మార్గదర్శకాల అసలైన సంస్కరణ ఆంగ్లంలో ఉంది. ఇది వివిధ భాషల్లోకి అనువదించబడుతుంది. వికీమీడియా ఫౌండేషన్ ఖచ్చితమైన అనువాదాలకు తమ వంతు కృషి చేస్తుంది. అయితే ఆంగ్ల సంస్కరణ (వెర్షన్),ఇతర భాషల అనువాదం మధ్య అర్థంలో ఏదైనా తేడా వస్తే, నిర్ణయాలు ఆంగ్ల సంస్కరణపై ఆధారపడి ఉంటాయి.

1.2 సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అమలు మార్గదర్శకాలు: సమీక్ష

ధర్మకర్తల మండలి (బోర్డు అఫ్ ట్రస్టీస్) సిఫార్సు ఆధారంగా, అమలు మార్గదర్శకాలను ఆమోదించిన ఒక సంవత్సరం తరువాత, వికీమీడియా ఫౌండేషన్ ఈ మార్గదర్శకాల అమలు గురించి కమ్యూనిటీ సంప్రదింపులు ఇంకా సమీక్షను నిర్వహిస్తుంది.

2. నివారణ కార్యక్రమం

ఈ విభాగం వికీమీడియా కమ్యూనిటీలకు అనుబంధ వ్యక్తులకు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి గురించిన అవగాహన కలిగిఉండటానికి, దానిని పూర్తిగా అర్థం చేసుకోవడానికి, కట్టుబడి ఉండటానికి మార్గదర్శకాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విభాగం సార్వత్రిక ప్రవర్తనా నియమావళి గురించి అవగాహన పెంచడం, అనువాదాలను నిర్వహించడం, అవసరమైనప్పుడు స్వచ్ఛందంగా కట్టుబడి ఉండటానికి ప్రోత్సహిస్తుంది.

2.1 సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అధికారిక ప్రకటన, నిర్ధారణ

వికీమీడియా ప్రాజెక్ట్‌లకు పరస్పరం సహకరించే ప్రతి ఒక్కరికీ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి వర్తిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వికీమీడియా ప్రాజెక్ట్‌లలో సహకారం కోసం ఇతర వేదికలలో (ప్లాట్‌ఫారమ్‌) ఆతిధ్యం చేయబడిన అధికారిక వ్యక్తిగత కార్యక్రమాలు, సంబంధిత ప్రదేశాలకు కూడా ఇది వర్తిస్తుంది.

వికీమీడియా ఉపయోగ నిబంధనలకు సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని జోడించాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

అదనంగా, ఈ క్రింది వ్యక్తులు సార్వత్రిక ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉన్నారని ధృవీకరించాలి:

  • వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది, ఒప్పందం చేసికొన్న వారు(కాంట్రాక్టర్లు), ధర్మకర్తల మండలి సభ్యులు, వికీమీడియా అనుబంధ బోర్డు సభ్యులు, సిబ్బంది;
  • వికీమీడియాలో లేదా వెలుపలగా పరిశోధన, అధ్యయన నేపథ్యంలో అనుబంధ, ఔత్సాహిక వికీమీడియా అనుబంధ సంస్థ ప్రతినిధి ఎవరైనా (అంటే, వికీమీడియా ప్రాయోజిత కార్యక్రమం, సమూహం, ప్రోత్సహించడానికి లేదా సహకరించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి లేదా వ్యక్తుల సమూహం);
  • వికీమీడియా ఫౌండేషన్ ట్రేడ్మార్క్ ను ఉపయోగించాలనుకునే వ్యక్తులు ఎవరైనా: వికీమీడియా ట్రేడ్మార్క్ వినియోగించుకున్న సంఘటనలు(ఈవెంట్ లు), వికీమీడియా శీర్షికతో ఒక కార్యక్రమంలో వికీమీడియా సంస్థ, కమ్యూనిటీ లేదా ప్రాజెక్ట్ ప్రాతినిధ్యం వంటివి.

2.1.1 సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అవగాహనను ప్రోత్సహించడం

అవగాహనను మెరుగుపరచడానికి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లంకెను ఫుటర్‌ (వెబ్ సైట్ లో క్రిందిభాగం)లలో అందుబాటులో ఉంచాలి.

  • వాడుకరులు, కార్యక్రమం నమోదుచేసే పేజీలు;
  • వికీమీడియా ప్రాజెక్ట్‌లలో, వాడుకరులు లాగ్-అవుట్ చేసిన నిర్ధారణ పేజీలు;
  • గుర్తింపు పొందిన అనుబంధ సంస్థలు వాడుకరుల సమూహాల వెబ్‌సైట్‌లు;

వ్యక్తిగత, సుదూర, మిశ్రమ కార్యక్రమాలలో, స్థానిక ప్రాజెక్ట్‌లు, అనుబంధ సంస్థలు, వినియోగదారు సమూహాలు, కార్యక్రమాల (ఈవెంట్) నిర్వాహకులు సముచితంగా భావించే ఎక్కడైనా ప్రముఖంగా పేర్కొనబడతాయి.

2.2 సార్వత్రిక ప్రవర్తనా నియమావళి శిక్షణ కొరకు సిఫార్సులు

యు4సి (Universal Code of Conduct Coordinating Committee) బిల్డింగ్ కమిటీ, వికీమీడియా ఫౌండేషన్ మద్దతుతో, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి గురించిన సాధారణ అవగాహన, దాని అమలుకు తగిన నైపుణ్యాలను అందించడానికి శిక్షణను అభివృద్ధి చేస్తుంది. దీనికి సంబంధిత భాగస్వాములను సంప్రదించాలని సిఫార్సు చేయబడింది, వీటిలో అనుబంధ వ్యక్తులు, అనుబంధ కమిటీలు, మధ్యవర్తిత్వ కమిటీలు, స్టీవార్డ్ లు, ఇతర ఉన్నత స్థాయి హక్కులు ఉన్నవారు, టి&ఎస్, చట్టపరమైన, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి పూర్తి దృశ్యాన్ని అందిస్తారు.

ఈ శిక్షణలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అమలు ప్రక్రియలలో భాగం కావాలనుకునే వ్యక్తుల కోసం లేదా తెలియజేయాలనుకునేవారికి ఉద్దేశించినవి.

సాధారణ సమాచారం, ఉల్లంఘనలు ఇంకా మద్దతును గుర్తించడం, సంక్లిష్టమైన కేసులు, విజ్ఞప్తులతో ఒక స్వతంత్ర మాడ్యూల్స్ లో శిక్షణ ఏర్పాటు చేయబడుతుంది. తరువాత, అవసరమైన విధంగా శిక్షణా మాడ్యూల్స్ నిర్వహించడానికి నవీకరించడానికి కూడా ఇది బాధ్యత వహిస్తుంది.

ట్రైనింగ్ మాడ్యూల్స్ సులభంగా యాక్సెస్ చేసుకోవడానికి వివిధ ఫార్మాట్లలో మరియు వేర్వేరు ప్లాట్ఫారమ్లలో అందుబాటులో ఉంటాయి. తమ కమ్యూనిటీ స్థాయిలో శిక్షణను అందించాలనుకునే స్థానిక సంఘాలు మరియు వికీమీడియా అనుబంధ సంస్థలు శిక్షణను అమలు చేయడానికి వికీమీడియా ఫౌండేషన్ నుండి ఆర్థిక సహాయం పొందుతాయి. ఇందులో అనువాదాలకు మద్దతు ఉంటుంది.

పాల్గొనేవారు తమ మాడ్యూల్‌ను పూర్తి చేసిన తరువాత ఈ విషయాన్ని బహిరంగంగా అంగీకరించే స్వతంత్రం కలిగి ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

ఈ క్రింది శిక్షణలు ప్రతిపాదిస్తారు

మాడ్యూల్ ఏ - అవగాహన(సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - సాధారణం).

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అమలుపై సాధారణ అవగాహన ఉండేలా చూడాలి.
  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అంటే ఏమిటి దాని అమలును, అలాగే ఉల్లంఘనలను నివేదించడంలో సహాయపడటానికి ఏ సాధనాలు అందుబాటులో ఉన్నాయో క్లుప్తంగా వివరించండి.

మాడ్యూల్ బి - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - ఉల్లంఘనల గుర్తింపు, నివేదించడం.

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను గుర్తించడానికి, నివేదించే ప్రక్రియలను అర్థం చేసుకోవడానికి, ఉపకరణాలను ఎలా ఉపయోగించాలో నేర్చుకోవడానికి వ్యక్తులకు సామర్థ్యాన్ని ఇవ్వండి.
  • ఉల్లంఘన రకం, స్థానిక సందర్భంలో నివేదించదగిన సందర్భాలను ఎలా గుర్తించాలి, నివేదికలు ఏవిధంగా ఎక్కడ తయారు చేయాలి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ప్రక్రియలలో కేసులను సక్రమంగా నిర్వహించడం గురించి వివరించండి.
  • వేధింపులు, అధికార దుర్వినియోగం (అవసరాన్ని బట్టి) వంటి సార్వత్రిక ప్రవర్తనా నియమావళి లోని నిర్దిష్ట విషయాలపై కూడా శిక్షణ ఉంటుంది.

మాడ్యూల్స్ సి - సంక్లిష్ట కేసులు, విజ్ఞప్తులు (సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - బహుళ ఉల్లంఘనలు, విజ్ఞప్తులు)

  • ఈ మాడ్యూల్స్ యూ4సిలో చేరడానికి భావి దరఖాస్తుదారులు, ఉన్నత స్థాయి హక్కులను కలిగి ఉన్నవారికి సిఫార్సు చేయబడతాయి
  • ఈ మాడ్యూల్ రెండు నిర్దిష్ట అంశాలను కలిగి ఉండాలి.
    • సి1 - సంక్లిష్ట కేసులను నిర్వహించడం (సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - బహుళ ఉల్లంఘనలు): వికీ ప్రాజెక్ట్ ల మధ్య కేసులు, దీర్ఘకాలిక వేధింపులు, బెదిరింపులను గుర్తించడం, సమర్థవంతమైన, సున్నితమైన కమ్యూనికేషన్ బాధితులను ఇతర బలహీన వ్యక్తుల భద్రతను రక్షించడం
    • C2 - సార్వత్రిక ప్రవర్తనా నియమావళి - విజ్ఞప్తులు: సార్వత్రిక ప్రవర్తనా నియమావళి విజ్ఞప్తులను నిర్వహించడం, కేసులను మూసివేయడం
  • ఈ మాడ్యూల్స్ బోధకుల నేతృత్వంలోని శిక్షణలుగా ఉంటాయి, ఇవి యు4సి సభ్యులు దరఖాస్తుదారులకు, నాన్ పబ్లిక్ పర్సనల్ డేటా పాలసీపై సంతకం చేసిన కమ్యూనిటీ-ఎన్నికైన అధికారులకు అందించబడతాయి.
  • ఈ బోధకుల నేతృత్వంలోని శిక్షణల కోసం వ్యక్తిగత మాడ్యూల్స్, స్లయిడ్‌లు, ప్రశ్నలు మొదలైనవి పబ్లిక్‌గా అందుబాటులో ఉంటాయి.

3. బాధ్యతాయుతమైన పని

ఈ విభాగం లక్ష్యం- సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల నివేదికలను క్రమబద్ధం చేయడానికి మార్గదర్శకాలు, సూత్రాలను అందించడం, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలతో వ్యవహరించే స్థానిక అమలు నిర్మాణాలకు సిఫార్సులను అందించడం, ఆ క్రమంలో, ఈవిభాగం నివేదికల ప్రక్రియ (ప్రాసెసింగ్) కోసం ముఖ్యమైన సూత్రాలు, నివేదించే సాధనాన్ని రూపొందించడానికి సిఫార్సులు, వివిధ స్థాయిలలో జరిగిన ఉల్లంఘనల కోసం, స్థానిక అమలు నిర్మాణాల కోసం సిఫార్సులను వివరిస్తుంది.

3.1 సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల ఫైలింగ్, ప్రాసెసింగ్ కొరకు సూత్రాలు

ఉద్యమం అంతటా నివేదిక వ్యవస్థ కొరకు ఈ క్రింది సూత్రాలు ప్రమాణాలు.

నివేదికలు:

  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడం ఉల్లంఘనను లక్ష్యం చేసికోవడం ద్వారా సాధ్యమవుతుంది, అలాగే సంఘటనను గమనించిన సంబంధం లేని మూడవ పక్షాల ద్వారా సాధ్యమవుతుంది
  • నివేదికలు సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను - అవి ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో, ఏ ప్రదేశంలో జరిగినా మూడవ పక్షం ద్వారా హోస్ట్ చేయబడినా కూడా అంద (కవర్) చేయగలవు,
  • నివేదికలు బహిరంగంగా లేదా వివిధ స్థాయిలలో గోప్యంగా తయారు చేయడం సాధ్యమవుతుంది
  • అపాయం, చట్టబద్ధతను సరిగ్గా అంచనా వేయడానికి, నిందారోపణల విశ్వసనీయత ధృవీకరణ క్షుణ్ణంగా చేయబడుతుంది
  • ఎవరైతే వాడుకరులు చెడు విశ్వాసం లేదా అన్యాయమైన నివేదికలను నిరంతరం పంపుతుంటారో వారు నివేదించే హక్కును కోల్పోతారు.
  • ఆరోపించబడిన వ్యక్తులు వారిపై ఆరోపించిన ఉల్లంఘన వివరాలను అందుకోగలరు. నిష్ణాతులు లేని భాషలలో నివేదికలు అందించినప్పుడు నియమించబడిన వ్యక్తులు వికీమీడియా ఫౌండేషన్ ద్వారా అనువాదం తప్పక అందించాలి

ప్రాసెసింగ్ ఉల్లంఘనలు:

  • ఫలితాలు ఉల్లంఘన తీవ్రతకు అనులోమానుపాతంలో ఉంటాయి
  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి సూత్రాలకు అనుగుణంగా సందర్భానుసారంగా కేసులకు తీర్పు ఇస్తారు.
  • కేసులను ఒక స్థిరమైన కాలపరిమితిలో పరిష్కరిస్తారు, ఒకవేళ అది దీర్ఘకాలికంగా ఉంటే పాల్గొనేవారికి సకాలంలో తాజా సమాచారం అందిస్తారు.

పారదర్శకత:

  • సాధ్యమైనంతవరకు, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన ప్రక్రియను పూర్తి చేసిన సమూహం, ఆ సంఘటనలను(కేసుల) భద్రపరచిన ఆర్కైవ్ ను బహిరంగంగా అందిస్తుంది, అదే సమయంలో పూర్తి కాని కేసులలో గోప్యతను, భద్రతను కాపాడుతుంది
  • వికీమీడియా ఫౌండేషన్ సెక్షన్ 3.2 లో ప్రతిపాదించిన విధంగా 'కేంద్ర నివేదనా సాధనం' ఉపయోగం గురించి ప్రాథమిక గణాంకాలను ప్రచురిస్తుంది. అలాగే కనీస డేటా సేకరణ, గోప్యతను గౌరవించే సూత్రాలను పరిగణనలోకి తీసుకుంటుంది.
    • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల ప్రక్రియ నిర్వహించే ఇతర సమూహాలు తమ ప్రాథమిక గణాంకాలను నివేదిస్తాయి, అదే సమయంలో కనీస డేటా సేకరణ గోప్యత సూత్రాలను గౌరవిస్తాయి.

3.1.1 కేసులను ప్రాసెస్ చేయడానికి వనరులను అందించడం

స్థానిక పాలనా వ్యవస్థల ద్వారా యుసిఒసి అమలుకు అనేక విధాలుగా మద్దతు ఉంటుంది.కమ్యూనిటీలు వాటి అమలు నిర్మాణాల సామర్థ్యం, పాలన విధానం, తమ ప్రాధాన్యతలు వంటి అనేక అంశాల ఆధారంగా వివిధ యంత్రాంగాలు లేదా విధానాల నుండి ఎంచుకోగలుగుతాయి. ఈ విధానాలలో కొన్ని-

  • ఒక నిర్దిష్ట వికీమీడియా ప్రాజెక్టుకు మధ్యవర్తిత్వ కమిటీ (Arbcom -ఆర్బ్కామ్)
  • ఈ ఆర్బ్ కామ్ కు బహుళ వికీమీడియా ప్రాజెక్టుల మధ్య భాగస్వామ్యం ఉంటుంది
  • వికేంద్రీకృత పద్ధతిలో యూసీవోసీకి అనుగుణంగా స్థానిక విధానాలను అమలు చేస్తున్న ఉన్నత హక్కు దారులు
  • విధానాలను అమలు చేసే స్థానిక పాలకుల ప్యానెల్స్
  • కమ్యూనిటీ చర్చ ఒప్పందం ద్వారా స్థానిక విధానాలను అమలు చేసే స్థానిక భాగస్వాములు

కమ్యూనిటీలు యుసిఒసితో విభేదించని చోట ఇప్పటికే ఉన్న మార్గాల ద్వారా అమలును కొనసాగించాలి.

3.1.2 ఉల్లంఘనల రకాన్ని బట్టి అమలు

ఈ విభాగం విభిన్న రకాల ఉల్లంఘనల అసమగ్ర జాబితాను, దానికి సంబంధించిన సంభావ్య అమలును యంత్రాంగంతో పాటుగా వివరిస్తుంది.

  • ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే
    • వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
  • వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే
    • వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
  • వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
    • సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు
    • అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
    • వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘన చట్టపరమైన బాధ్యతను ప్రేరేపిస్తే అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
  • అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే
    • అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
  • సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే
    • టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
  • యుసిఒసిని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
    • U4C నిర్వహిస్తుంది
    • వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు - ఏమంటే

యుసిఒసిని అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం యుసిఒసితో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము యూసీవోసీ అమలు నిరాకరించడం వనరుల లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం

  • వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
    • బహుళ వికీలలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఏ విధమైనవి అంటే: ప్రపంచ సిసోప్ లు, స్టీవార్డ్ లు, సింగిల్-వికీ యుసిఒసి ఉల్లంఘనలను నిర్వహించే సంస్థలు లేదా ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని U4C లు నిర్వహించుతాయి
    • ఒకే వికీలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు.
      • విధ్వంసం వంటి సాధారణ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
  • వికీ బయట (ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
    • స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు నిర్మాణాల ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
    • కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ స్పేస్ అమలు నిర్మాణాలకు నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
  • వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
    • ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాలు తరచుగా ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
    • ఈ కేసులను నిర్వహించే అమలు నిర్మాణాలు వాటిని యు4సికి సూచించవచ్చు
    • వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది

3.2 నివేదన పరికరం (రిపోర్టింగ్ టూల్) కొరకు సిఫార్సులు

సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల కోసం కేంద్రీకృత నివేదన ప్రక్రియ (రిపోర్టింగ్ ప్రాసెసింగ్)సాధనాన్ని వికీమీడియా ఫౌండేషన్ అభివృద్ధి చేసి నిర్వహిస్తుంది. ఈ సాధనంతో మీడియావికీ ద్వారా నివేదికలు తయారు చేయడం సాధ్యమవుతుంది. సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నివేదించడానికి, ప్రాసెస్ చేయడానికి సాంకేతిక సమస్యలను తగ్గించడం దీని ఉద్దేశ్యం.

నివేదికలలో సంబంధిత చర్య తీసుకోగల సమాచారం ఉండాలి లేదా చేతిలో ఉన్న కేసుకు సంబంధించిన డాక్యుమెంటేషన్ను అందించాలి. నివేదికను అందించే ఆన్లైన్ వేదిక (రిపోర్టింగ్ ఇంటర్ఫేస్)ఆ నిర్దిష్ట కేసును ప్రాసెస్ చేయడానికి బాధ్యత వహించేవారికి వివరాలను అందించడానికి అనుమతించాలి. ఇందులో సమాచారం ఉంటుంది, కానీ వీటికే పరిమితం కాదుః

  • నివేదించబడిన ప్రవర్తన సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని ఏవిధంగా ఉల్లంఘిస్తోంది
  • సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన వలన ఎవరు లేదా ఏమి హాని చేసారు
  • సంఘటన జరిగిన తేదీ, సమయం
  • సంఘటన జరిగిన ప్రదేశం
  • అమలు చేసే సమూహాలు ఈ విషయాన్ని బాగా నిర్వహించడానికి కావలసిన ఇతర సమాచారం

ఈ సాధనం వాడుకలో సౌలభ్యం, గోప్యత, భద్రత, ప్రాసెసింగ్‌లో సౌలభ్యం, పారదర్శకత సూత్రాలను అనుసరించి పనిచేయాలి.

సార్వత్రిక ప్రవర్తనా నియమావళిని అమలు చేయాల్సిన వ్యక్తులు ఈ సాధనాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదు. సులభంగా ఉపయోగించడం, గోప్యత, భద్రత, ప్రాసెసింగ్ లో సౌలభ్యం, పారదర్శకత వంటి సూత్రాల ప్రకారం కేసులను నిర్వహించేంత వరకు వారు తగినవిగా భావించే సాధనాలతో పనిచేయడం కొనసాగించవచ్చు.

3.3 అమలు నిర్మాణాల కొరకు సూత్రాలు, సిఫార్సులు

సాధ్యమైన చోట, ఇక్కడ పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనల నివేదికలను స్వీకరించడం వాటితో వ్యవహరించే బాధ్యతను ఇప్పటికే అమలు చేసే నిర్మాణాలను చేపట్టమని మేము ప్రోత్సహిస్తున్నాము. ఉద్యమం అంతటా యుసిఒసి అమలు స్థిరంగా ఉండేలా చూసుకోవడానికి, సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను నిర్వహించేటప్పుడు కింది ప్రాథమిక సూత్రాలను వర్తింపజేయాలని మేము సిఫార్సు చేస్తున్నాము.

3.3.1 ప్రక్రియలో నిష్పాక్షికత =

సహాయక సంఘర్షణ-ప్రయోజనాల విధానాలను అభివృద్ధి చేయడం మరియు నిర్వహించడంలో అమలు నిర్మాణాలను మేము ప్రోత్సహిస్తాము. అడ్మిన్లు లేదా ఇతరులు సమస్యతో సన్నిహితంగా పాల్గొన్నప్పుడు నివేదికకు ఎప్పుడు దూరంగా ఉండాలో లేదా ఉపసంహరించుకోవాలో నిర్ణయించడానికి ఇవి సహాయపడతాయి.

అన్ని పక్షాలు సాధారణంగా సమస్యలు మరియు సాక్ష్యాలపై తమ దృక్పథాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటాయి మరియు మరింత సమాచారం, దృక్పథం మరియు సందర్భాన్ని అందించడంలో సహాయపడటానికి ఇతరుల నుండి ఫీడ్ బ్యాక్ ను కూడా ఆహ్వానించవచ్చు. ఇది గోప్యత మరియు భద్రతను సంరక్షించడానికి పరిమితం కావచ్చు.

3.3.2 ప్రక్రియ యొక్క పారదర్శకత

U4C, 4.1లో నిర్వచించిన విధంగా దాని ఉద్దేశ్యం మరియు పరిధికి అనుగుణంగా, UCoC అమలు చర్యల యొక్క సమర్థత మరియు ఉద్యమం అంతటా సాధారణ ఉల్లంఘనలతో వాటి సంబంధంపై డాక్యుమెంటేషన్ ను అందిస్తుంది. ఈ పరిశోధన నిర్వహించడానికి వికీమీడియా ఫౌండేషన్ వారికి సహకరించాలి. ఈ డాక్యుమెంటేషన్ యొక్క లక్ష్యం యుసిఒసిని అమలు చేయడానికి ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడంలో అమలు నిర్మాణాలకు సహాయపడటం.

వికీమీడియా ప్రాజెక్టులు మరియు అనుబంధ సంస్థలు, సాధ్యమైనప్పుడు, యుసిఒసి విధాన పాఠానికి అనుగుణంగా విధానాలు మరియు అమలు యంత్రాంగాలను వివరించే పేజీలను నిర్వహించాలి. యుసిఒసి విధాన పాఠానికి విరుద్ధంగా ఉన్న ప్రస్తుత మార్గదర్శకాలు లేదా విధానాలతో ప్రాజెక్టులు మరియు అనుబంధ సంస్థలు గ్లోబల్ కమ్యూనిటీ ప్రమాణాలకు అనుగుణంగా మార్పులను చర్చించాలి. కొత్త స్థానిక విధానాలను నవీకరించడం లేదా సృష్టించడం యుసిఒసితో విభేదించని విధంగా చేయాలి. ప్రాజెక్టులు మరియు అనుబంధ సంస్థలు సంభావ్య కొత్త విధానాలు లేదా మార్గదర్శకాల గురించి U4C నుండి సలహా అభిప్రాయాలను అభ్యర్థించవచ్చు.

తృతీయ పక్ష వేదికలపై హోస్ట్ చేయబడిన సంబంధిత స్థలంలో జరిగే వికీమీడియా-నిర్దిష్ట సంభాషణలకు (ఉదా. డిస్కార్డ్, టెలిగ్రామ్ మొదలైనవి), వికీమీడియా యొక్క ఉపయోగ నిబంధనలు వర్తించకపోవచ్చు. అవి ఆ నిర్దిష్ట వెబ్సైట్ యొక్క వినియోగ నిబంధనలు మరియు ప్రవర్తనా విధానాల ద్వారా కవర్ చేయబడతాయి. ఏదేమైనా, తృతీయ పక్ష వేదికలపై హోస్ట్ చేయబడిన సంబంధిత స్థలంలో వికీమీడియన్ల ప్రవర్తనను యుసిఒసి ఉల్లంఘనల నివేదికలలో సాక్ష్యంగా అంగీకరించవచ్చు. తృతీయ పక్ష వేదికలపై వికీమీడియా సంబంధిత ప్రదేశాలను మోడరేట్ చేసే వికీమీడియా కమ్యూనిటీ సభ్యులను వారి విధానాలలో యుసిఒసి గౌరవాన్ని చేర్చమని మేము ప్రోత్సహిస్తాము. వికీమీడియా ఫౌండేషన్ తృతీయ పక్ష వేదికల కోసం ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడానికి ప్రయత్నించాలి, ఇవి ఆన్-వికీ సంఘర్షణల కొనసాగింపును నిరుత్సాహపరుస్తాయి.

3.3.3 విజ్ఞప్తులు =

వ్యక్తిగత అధునాతన హక్కుల హోల్డర్ తీసుకున్న చర్య U4C కాకుండా స్థానిక లేదా భాగస్వామ్య అమలు వ్యవస్థకు అప్పీల్ చేయబడుతుంది. ఒకవేళ అటువంటి అమలు నిర్మాణం లేనట్లయితే అప్పుడు U4Cకి అప్పీల్ చేయవచ్చు. ఈ ఏర్పాటును పక్కన పెడితే, స్థానిక కమ్యూనిటీలు వేరొక వ్యక్తిగత అధునాతన హక్కుల హోల్డర్‌కు విజ్ఞప్తులను అనుమతించవచ్చు.

సంబంధిత సందర్భోచిత సమాచారం మరియు ఉపశమన కారకాల ఆధారంగా అప్పీళ్లను ఆమోదించడానికి మరియు పరిగణించడానికి అమలు నిర్మాణాలు ప్రమాణాలను ఏర్పరుస్తాయి. ఈ కారకాలలో ఇవి ఉన్నాయి, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు: ఆరోపణల యొక్క ధృవీకరణ, మంజూరు యొక్క పొడవు మరియు ప్రభావం మరియు అధికార దుర్వినియోగం లేదా ఇతర వ్యవస్థాగత సమస్యలు మరియు తదుపరి ఉల్లంఘనల సంభావ్యత అనుమానం ఉందా. అప్పీల్ ఆమోదానికి హామీ లేదు.

వికీమీడియా ఫౌండేషన్ లీగల్ విభాగం తీసుకున్న కొన్ని నిర్ణయాలకు వ్యతిరేకంగా అప్పీళ్లు చేయడం సాధ్యం కాదు. ఏదేమైనా, కొన్ని వికీమీడియా ఫౌండేషన్ కార్యాలయ చర్యలు మరియు నిర్ణయాలు కేస్ రివ్యూ కమిటీచే సమీక్షించబడతాయి. చట్టపరమైన అవసరాలు భిన్నంగా ఉంటే, ఈ పరిమితి, ముఖ్యంగా కార్యాలయ చర్యలు మరియు నిర్ణయాల నుండి అప్పీళ్లపై, కొన్ని అధికార పరిధుల్లో వర్తించకపోవచ్చు.

అప్పీల్‌ను మంజూరు చేయడానికి లేదా తిరస్కరించడానికి ఒక ఆధారాన్ని ఏర్పరచడానికి కేసులపై సమాచార దృక్కోణాలను అమలు చేసే నిర్మాణాలు వెతకాలి. ప్రమేయం ఉన్న వ్యక్తుల గోప్యత మరియు నిర్ణయం తీసుకునే ప్రక్రియ కోసం సమాచారాన్ని సున్నితంగా నిర్వహించాలి.

ఈ లక్ష్యాన్ని సాధించడానికి, అప్పీల్‌లను సమీక్షించేటప్పుడు అమలు నిర్మాణాలు విభిన్న అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని మేము సిఫార్సు చేస్తున్నాము. ఇవి వీటిని కలిగి ఉండవచ్చు, కానీ వీటికే పరిమితం కాకూడదు:

  • ఉల్లంఘన వలన కలిగే తీవ్రత మరియు హాని
  • ఉల్లంఘనల పూర్వ చరిత్రలు
  • అప్పీల్ చేయబడిన ఆంక్షల తీవ్రత
  • ఉల్లంఘన జరిగినప్పటి నుండి ఎంత సమయం ఉంది
  • పరిచయంలో ఉల్లంఘన యొక్క విశ్లేషణ
  • అధికార దుర్వినియోగం లేదా ఇతర వ్యవస్థాగత సమస్యపై అనుమానాలు

4. యుసిఒసి సమన్వయ కమిటీ (U4C)

యూనివర్సల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కోఆర్డినేటింగ్ కమిటీ (యూ4సీ) పేరుతో కొత్త గ్లోబల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీ ఇతర ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థలతో (ఉదా. ఆర్బ్ కామ్స్ మరియు అఫ్ కామ్) సహ-సమాన సంస్థగా ఉంటుంది. యుసిఒసిని అమలు చేయడంలో స్థానిక సమూహాలు వ్యవస్థాగత వైఫల్యాల విషయంలో అంతిమ సహాయంగా పనిచేయడం దీని ఉద్దేశం. U4C యొక్క సభ్యత్వం మన గ్లోబల్ కమ్యూనిటీ యొక్క గ్లోబల్ మరియు వైవిధ్యమైన అలంకరణను ప్రతిబింబిస్తుంది.

= 4.1 ఉద్దేశ్యం మరియు పరిధి

యుసిఒసి ఉల్లంఘనల నివేదికలను U4C పర్యవేక్షిస్తుంది మరియు అదనపు పరిశోధనలు నిర్వహించవచ్చు మరియు తగిన చోట చర్యలు తీసుకోవచ్చు. U4C క్రమం తప్పకుండా యుసిఒసి అమలు స్థితిని పర్యవేక్షిస్తుంది మరియు అంచనా వేస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ మరియు సమాజం పరిగణనలోకి తీసుకోవడానికి యుసిఒసి మరియు యుసిఒసి ఎన్ ఫోర్స్ మెంట్ మార్గదర్శకాలకు తగిన మార్పులను ఇది సూచించవచ్చు, కాని రెండు పత్రాలను తనంతట తానుగా మార్చకపోవచ్చు. అవసరమైనప్పుడు, కేసులను నిర్వహించడంలో వికీమీడియా ఫౌండేషన్ కు U4C సహాయపడుతుంది.

U4C:

  • ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాలలో పేర్కొన్న పరిస్థితులలో ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను నిర్వహిస్తుంది
  • చెప్పిన ఫిర్యాదులు మరియు విజ్ఞప్తులను పరిష్కరించడానికి అవసరమైన ఏవైనా పరిశోధనలు చేస్తాయి
  • తప్పనిసరి శిక్షణా సామగ్రి మరియు అవసరమైన ఇతర వనరుల వంటి యు.సి.ఒ.సి ఉత్తమ పద్ధతులపై కమ్యూనిటీలకు వనరులను అందిస్తుంది.
  • కమ్యూనిటీ సభ్యులు మరియు అమలు నిర్మాణాల సహకారంతో, యు.సి.ఒ.సి అమలు మార్గదర్శకాలు మరియు యు.సి.ఒ.సి యొక్క తుది వ్యాఖ్యానాన్ని అందిస్తుంది, ఇది కమ్యూనిటీ సభ్యులు మరియు అమలు నిర్మాణాల సహకారంతో
  • యు.సి.ఒ.సి అమలు యొక్క ప్రభావాన్ని పర్యవేక్షిస్తుంది మరియు అంచనా వేస్తుంది మరియు మెరుగుదల కోసం సిఫార్సులను అందిస్తుంది

యు.సి.ఒ.సి యొక్క ఉల్లంఘనలు లేదా దాని అమలుతో సంబంధం లేని కేసులను U4C తీసుకోదు. తీవ్రమైన వ్యవస్థాగత సమస్యలు తలెత్తిన సందర్భాల్లో తప్ప యు4సి తన తుది నిర్ణయాధికారాన్ని అప్పగించవచ్చు. U4C యొక్క బాధ్యతలు 3.1.2 లో ఇతర అమలు నిర్మాణాల నేపధ్యంలో వివరించబడ్డాయి.

4.2 ఎంపిక, సభ్యత్వం మరియు పాత్రలు

గ్లోబల్ కమ్యూనిటీ నిర్వహించే వార్షిక ఎన్నికలు ఓటింగ్ సభ్యులను ఎంపిక చేస్తాయి. అభ్యర్థులు ఏ కమ్యూనిటీ సభ్యుడైనా కావచ్చు:

  • వికీమీడియా ఫౌండేషన్ నాన్ పబ్లిక్ పర్సనల్ డేటా యాక్సెస్ కోసం ప్రమాణాలను చేరుకోవడం మరియు వారు ప్రమాణాలను పూర్తిగా పాటిస్తామని వారి ఎన్నికల ప్రకటనలో ధృవీకరించడం
  • ప్రస్తుతం ఏ వికీమీడియా ప్రాజెక్టులోనూ అనుమతి లేదు లేదా ఈవెంట్ బ్యాన్ కలిగి ఉండరాదు.
  • యు.సి.ఒ.సి ని పాటించండి
  • ఎన్నికల ప్రక్రియలో నిర్ణయించిన ఇతర అర్హత అవసరాలను తీర్చడం

అసాధారణ పరిస్థితుల్లో, రాజీనామాలు లేదా నిష్క్రియాత్మకత అదనపు సభ్యుల తక్షణ అవసరాన్ని సృష్టించిందని నిర్ధారిస్తే, U4C మధ్యంతర ఎన్నికలను పిలవవచ్చు. సాధారణ వార్షిక ఎన్నికల మాదిరిగానే ఎన్నికలు ఉంటాయి.

U4C యొక్క వ్యక్తిగత సభ్యులు ఇతర పదవులకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు (ఉదా. స్థానిక సైసోప్, ఆర్బ్ కామ్ సభ్యుడు, ఈవెంట్ సేఫ్టీ కోఆర్డినేటర్). అయినప్పటికీ వారు వారి ఇతర స్థానాల ఫలితంగా ప్రత్యక్షంగా పాల్గొన్న కేసుల ప్రాసెసింగ్లో పాల్గొనకపోవచ్చు. పబ్లిక్ కాని సమాచారానికి ప్రాప్యతను అందించడం కొరకు U4C యొక్క సభ్యులు యాక్సెస్ టు పబ్లిక్ పర్సనల్ డేటా పాలసీపై సంతకం చేస్తారు. U4C బిల్డింగ్ కమిటీ U4C సభ్యులకు తగిన నిబంధనలను నిర్ణయించాలి.

U4C ఉపసంఘాలను ఏర్పాటు చేయవచ్చు లేదా నిర్దిష్ట విధులు లేదా పాత్రలకు తగిన వ్యక్తులను నియమించవచ్చు.

వికీమీడియా ఫౌండేషన్ U4Cకి ఇద్దరు నాన్-ఓటింగ్ సభ్యులను నియమించవచ్చు మరియు కోరుకున్న మరియు తగిన విధంగా సహాయక సిబ్బందిని అందిస్తుంది.

4.3 విధానాలు

U4C ఇది ఎంత తరచుగా సమావేశమవుతుందో మరియు ఇతర ఆపరేటింగ్ విధానాలపై నిర్ణయిస్తుంది. U4C వారి పరిధిలో ఉన్నంతవరకు వారి విధానాలను సృష్టించవచ్చు లేదా సవరించవచ్చు. సముచితమైనప్పుడల్లా, కమిటీ వాటిని అమలు చేయడానికి ముందు ఉద్దేశించిన మార్పులపై కమ్యూనిటీ అభిప్రాయాన్ని ఆహ్వానించాలి.

= 4.4 విధానం మరియు పూర్వాపరాలు

U4C కొత్త విధానాన్ని సృష్టించదు మరియు యు.సి.ఒ.సి ని సవరించకపోవచ్చు లేదా మార్చదు. U4C బదులుగా యు.సి.ఒ.సి ను దాని పరిధి ద్వారా నిర్వచించిన విధంగా వర్తిస్తుంది మరియు అమలు చేస్తుంది.

కమ్యూనిటీ విధానాలు, మార్గదర్శకాలు మరియు నిబంధనలు కాలక్రమేణా అభివృద్ధి చెందుతున్నందున, మునుపటి నిర్ణయాలు ప్రస్తుత సందర్భంలో సంబంధితంగా ఉన్నంత వరకు మాత్రమే పరిగణనలోకి తీసుకోబడతాయి.

4.5 U4C బిల్డింగ్ కమిటీ

యు.సి.ఒ.సి అమలు మార్గదర్శకాలను ఆమోదించిన తరువాత, వికీమీడియా ఫౌండేషన్ ఒక బిల్డింగ్ కమిటీకి ఈ క్రింది వాటిని సులభతరం చేస్తుంది:

  • U4C యొక్క విధానాలు, విధానం మరియు ఉపయోగాన్ని నిర్ణయించడం
  • యు4సి ప్రక్రియ యొక్క మిగిలిన భాగాన్ని రూపొందించండి
  • U4Cని స్థాపించడానికి అవసరమైన ఇతర లాజిస్టిక్స్ ను కేటాయించండి
  • U4C కోసం ప్రారంభ ఎన్నికల ప్రక్రియలను సులభతరం చేయడానికి సహాయపడండి

బిల్డింగ్ కమిటీలో వాలంటీర్ కమ్యూనిటీ సభ్యులు, అనుబంధ సిబ్బంది లేదా బోర్డు సభ్యులు మరియు వికీమీడియా ఫౌండేషన్ సిబ్బంది ఉంటారు.

సభ్యులను వికీమీడియా ఫౌండేషన్ యొక్క కమ్యూనిటీ స్థితిస్థాపకత మరియు సుస్థిరత ఉపాధ్యక్షులు. ఎన్నుకుంటారు. కమిటీలోని వాలంటీర్ సభ్యులను కమ్యూనిటీ సభ్యులుగా గౌరవించాలి.

సభ్యులు ఉద్యమ అమలు ప్రక్రియల యొక్క విభిన్న దృక్పథాలను అనుభవంతో ప్రతిబింబించాలి, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు: విధాన ముసాయిదా రూపకల్పన, వికీమీడియా ప్రాజెక్టులలో ప్రస్తుత నియమాలు మరియు విధానాల అనువర్తనంలో పాల్గొనడం మరియు అవగాహన మరియు భాగస్వామ్య నిర్ణయాలు తీసుకోవడం. దీని సభ్యులు ఉద్యమం యొక్క వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి, కానీ వీటికి మాత్రమే పరిమితం కాదు: మాట్లాడే భాషలు, లింగం, వయస్సు, భౌగోళికం మరియు ప్రాజెక్ట్ రకం.

U4C బిల్డింగ్ కమిటీ యొక్క పనిని గ్లోబల్ కౌన్సిల్ లేదా ఈ డాక్యుమెంట్ యొక్క ఆమోదానికి సమానమైన కమ్యూనిటీ ప్రక్రియ ద్వారా ధృవీకరించబడుతుంది. ఈ బిల్డింగ్ కమిటీ పని ద్వారా యు4సిని ఏర్పాటు చేసిన తరువాత, బిల్డింగ్ కమిటీ రద్దు చేయాలి.

5. పదకోశం

నిర్వాహకుడు (సిసోప్ లేదా అడ్మిన్)
ఉన్నత హక్కులు కలిగినవాడు
సాధారణ ఎడిటింగ్ అనుమతులే కాకుండా, పరిపాలనా హక్కులను కలిగి ఉన్న వాడుకరి. సాధారణంగా కమ్యూనిటీ ప్రక్రియలో ఎన్నుకుంటారు లేదా మధ్యవర్తిత్వ కమిటీలచే నియమించబడతారు. ఇందులో, అసమగ్రం జాబితా లో: స్థానిక సైసోప్స్ / నిర్వాహకులు, అధికారులు, గ్లోబల్ సిసోప్ లు, స్టీవార్డ్ లు ఉంటారు.
అనుబంధాల కమిటీ లేదా Affcom

వికీమీడియా ఉద్యమ అనుబంధ సంస్థల గుర్తింపు, ఆమోదం ఉనికిపై ఆ సంస్థలను అనుబంధాల కమిటీ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలకు సిఫార్సులు చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వికీమీడియన్‌లు అధ్యాయాలు, నేపథ్య సంస్థలు, వినియోగదారు సమూహాలుగా స్వీయ-వ్యవస్థీకరణకు, వికీమీడియా ఫౌండేషన్ నుండి అధికారిక గుర్తింపు పొందేందుకు సహాయం చేస్తుంది.

ఆర్బిట్రేషన్ కమిటీ లేదా ఆర్బ్ కామ్
కొన్ని వివాదాలకు తుది నిర్ణయం తీసుకునే సమూహంగా పనిచేసే విశ్వసనీయ వినియోగదారుల సమూహం. ఈ ఆర్బ్ కామ్ పరిధిని దాని కమ్యూనిటీ ద్వారా నిర్వచిస్తుంది. ఒక ఆర్బ్ కామ్ ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులకు (ఉదా. వికీన్యూస్ మరియు వికీవోయేజ్)లేదా భాషలకు సేవలందించవచ్చు. ఈ మార్గదర్శకాల ప్రయోజనాల కోసం, ఇందులో వికీమీడియా సాంకేతిక ప్రదేశాల ప్రవర్తనా నియమావళి కమిటీ, పరిపాలనా ప్యానెల్స్ ఉన్నాయి.
అనుసంధాన (బైండింగ్) క్రియలు
ఎన్‌ఫోర్స్‌మెంట్ మార్గదర్శకాలను రూపొందించేటప్పుడు, డ్రాఫ్టింగ్ కమిటీ 'క్రియేట్', 'డెవలప్', 'ఎన్‌ఫోర్స్', 'మస్ట్', 'ప్రొడ్యూస్', 'షల్', 'విల్' అనే పదాలను అనుసంధాన క్రియా పదాలుగా పరిగణించింది. దీన్ని సిఫార్సు క్రియలుతో పోల్చండి.
కేసు రివ్యూ కమిటీ(CRC)
వికీమీడియా సంఘం నుండి 10 మంది అనుభవజ్ఞులైన స్వచ్ఛంద వాడుకరులతో కూడిన ఈ కమిటీ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి పూర్తిగా అమలులోకి వచ్చే వరకు పని చేస్తుంది.
సంఘం
ప్రాజెక్ట్ కు సంబంధించిన సంఘాన్ని సూచిస్తుంది. ఈ సంఘం తీసుకునే నిర్ణయాలు సాధారణంగా ఏకాభిప్రాయం ద్వారా నిర్ణయించుతారు.
క్రాస్-వికీ
వికీలో ఒకటి కంటే ఎక్కువ ప్రాజెక్టులను ప్రభావితం చేయడం లేదా సంభవించడం. ఇవి కూడా చూడండి: గ్లోబల్.

ఈవెంట్ సేఫ్టీ కోఆర్డినేటర్ః వ్యక్తిగతంగా వికీమీడియా-అనుబంధ ఈవెంట్ నిర్వాహకులు ఆ ఈవెంట్ యొక్క భద్రత, భద్రతకు బాధ్యత వహించే వ్యక్తి.

గ్లోబల్
వికీమీడియా ఉద్యమంలో, “గ్లోబల్” అనేది ఉద్యమ-విస్తృత పాలక సంస్థలను సూచించే పరిభాష పదం. ప్రపంచవ్యాప్తంగా అన్ని వికీమీడియా ప్రాజెక్టులను సూచిస్తుంది. ఇది సాధారణంగా “స్థానిక”కు విరుద్ధంగా ఉపయోగించుతారు.
గ్లోబల్ సిసోప్స్
సిసోప్స్ అంటే సిస్టం ఆపరేటర్ లు. నిర్వాహకులు. నిర్వాహకుల పాత్ర, అంచనాలు, ఇంకా వారి విధానాలు వివిధ ప్రాజెక్ట్‌లలో విస్తృతంగా మారుతూ ఉంటాయి. నిర్వాహకులకు సాధారణ వాడుకరుల కంటే సాంకేతికంగా ఎక్కువ సామర్థ్యం ఉంటుంది.
ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థ
ఇది ఒక ఉన్నత స్థాయి సమూహం (అనగా U4C, ARBCOM, AFFCOM). అంతకు మించి పై స్థాయి అప్పీల్ ఉండదు. వేర్వేరు సమస్యలకు వేర్వేరు ఉన్నత స్థాయి నిర్ణయాలు తీసుకునే సంస్థలు ఉండవచ్చు. నోటీసు బోర్డు వద్ద ఏర్పాటు చేసిన చర్చ ఫలితాలను అప్పీల్ చేయలేనప్పటికీ, నిర్ణయానికి దారితీసే వాడుకరుల సమూహాన్ని ఈ పదం సూచించదు.
స్థానికం
ఒకే వికీమీడియా ప్రాజెక్టు, అనుబంధ సంస్థ లేదా సంస్థను సూచిస్తుంది. ఈ పదం సాధారణంగా పరిస్థితికి వర్తించే అతిచిన్న, అత్యంత తక్షణ పాలక మండలిని సూచిస్తుంది.
ఆఫ్-వికీః ఆఫ్-వికీ సాధారణంగా వికీమీడియా ఫౌండేషన్ హోస్ట్ చేయని ఆన్లైన్ ప్రదేశాలను సూచిస్తుంది. ఇక్కడ వికీమీడియా కమ్యూనిటీ సభ్యులు చురుకుగా ఉండి, ప్రదేశాలను ఉపయోగిస్తుంటారు. ఉదాహరణకి ట్విట్టర్, వాట్సాప్, ఐఆర్సి (IRC), టెలిగ్రామ్, డిస్కార్డ్ మొదలైనవి.
వ్యక్తిగతంగా గుర్తించదగిన సమాచారం
ఒక నిర్దిష్ట వ్యక్తిని గుర్తించగల ఏదైనా సమాచారం. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి వేరుగా గుర్తించే ఏదైనా సమాచారం, గతంలో అనామక డేటాను బహిర్గతం చేసే ఏదైనా సమాచారాన్ని PII గా పరిగణిస్తారు.
ప్రాజెక్ట్ (వికీమీడియా ప్రాజెక్టు)
వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే వికీ ప్రాజెక్ట్.
సిఫారసు క్రియలు
అమలు మార్గదర్శకాలను రూపొందించేటప్పుడు ముసాయిదా (డ్రాఫ్టింగ్)కమిటీ 'ప్రోత్సహించడం', 'ఉండవచ్చు', 'ప్రతిపాదించడం', 'సిఫార్సు', 'ఉండాలి' అనే పదాలను సిఫార్సులుగా పరిగణించింది. దీనిని 'బైండింగ్ క్రియలు'తో పోల్చండి.
తృతీయపక్ష వేదికలపై హోస్ట్ చేయబడిన సంబంధిత ప్రదేశం
అంటే వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించని వ్యక్తిగత వికీలు, వెబ్ సైట్ లు. కానీ వాడుకరులు వికీమీడియాకు సంబంధించిన ప్రాజెక్టు విషయాలను చర్చిస్తారు. తరచుగా వికీమీడియా స్వచ్చంద వాడుకరులు సమన్వయము చేస్తారు.
సిబ్బంది
వికీమీడియా ఉద్యమ సంస్థకు కేటాయించిన సిబ్బంది. లేదా అటువంటి ఉద్యమ సంస్థ గుత్తేదారుల పనికి వికీమీడియా కమ్యూనిటీ సభ్యులతో లేదా వికీమీడియా ఉద్యమ ప్రదేశాలలో (ఆఫ్-వికీ వేదికల వంటి థర్డ్-పార్టీ ప్రదేశాలతో సహా వికీమీడియా ఉద్యమ కార్యాచరణ)పరస్పర చర్య అవసరం.
స్టీవార్డ్
అంటే ముఖ్య నిర్వాహకులు లేదా అధికారి. స్టీవార్డ్స్ అనేది అన్ని బహిరంగ వికీమీడియా వేదికలలోని వికీ ఇంటర్‌ఫేస్‌ లపై పూర్తి హక్కులు ఉన్న ప్రపంచ వ్యాప్త (గ్లోబల్) వాడుకరుల సమూహం. వారు అన్ని స్థానిక, ప్రపంచ వాడుకరుల హక్కులను సవరించడానికి, గ్లోబల్ ఖాతాల స్థితి, పేరును మార్చడానికి, నిర్వాహకులు, బ్యూరోక్రాట్‌లకు అందుబాటులో ఉన్న ఏవైనా అనుమతులను కూడా సవరించగల సాంకేతిక సామర్థ్యాన్ని కఉంటుంది.

వ్యవస్థాగత సమస్య లేదా వైఫల్యంః అనేక మంది వ్యక్తుల భాగస్వామ్యంతో, ముఖ్యంగా ఉన్నత హక్కులు ఉన్నవారి భాగస్వామ్యంలో సార్వత్రిక ప్రవర్తనా నియమావళి అనుసరించడంలో విఫలమైన సమస్య

వికీమీడియా ఫౌండేషన్ కార్యాలయం - కార్యాచరణ విధానం (యాక్షన్ పాలసీ)
పాలసీ లేదా దానికి సమానమైన వారసత్వ విధానం.