Translations:Policy:Universal Code of Conduct/Enforcement guidelines/38/te

From Wikimedia Foundation Governance Wiki
Revision as of 04:47, 2 March 2024 by Vjsuseela (talk | contribs)
  • ఉల్లంఘనలు ఏదైనా బెదిరింపులతో కూడిన శారీరక హింస ఉంటే
    • వికీమీడియా ట్రస్ట్ & సేఫ్టీ బృందం నిర్వహిస్తారు
  • వ్యాజ్యం లేదా చట్టపరమైన బెదిరింపులతో కూడిన ఉల్లంఘనలు అయితే
    • వికీమీడియా ఫౌండేషన్ వారి చట్టపరమైన బృందానికి (లీగల్ టీమ్), లేదా అవసరమైనప్పుడు, బెదిరింపులకు తగిన విధంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు
  • వ్యక్తిగతంగా గుర్తించే సమాచారాన్ని అనధికారికంగా బహిర్గతం చేయడం వంటి ఉల్లంఘనల విషయంలో
    • సాధారణ పర్యవేక్షణతో వినియోగదారులు ఎడిట్ నిరోధం, అనుమతులను నిర్వహిస్తారు
    • అప్పుడప్పుడు ట్రస్ట్ & సేఫ్టీ బృందం కూడా నిర్వహించుతుంది
    • వికీమీడియా ఫౌండేషన్ లీగల్ టీమ్ కు పంపుతారు. లేదా, ఈరకమైన ఉల్లంఘన చట్టపరమైన బాధ్యతను ప్రేరేపిస్తే అవసరమైనప్పుడు, కేసు స్వభావాన్ని బట్టి సముచితంగా అంచనా వేయగల ఇతర నిపుణులకు పంపుతారు.
  • అనుబంధ పాలనకు సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే
    • అఫిలియేషన్స్ కమిటీ లేదా తత్సమాన సంస్థ నిర్వహిస్తుంది.
  • సాంకేతిక ప్రదేశాల్లో ఉల్లంఘనలు కనపడితే
    • టెక్నికల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కమిటీ నిర్వహిస్తుంది.
  • యుసిఒసిని పాటించడంలో వ్యవస్థాపరమైన వైఫల్యం కనబడితే
    • U4C నిర్వహిస్తుంది
    • వ్యవస్థాపరమైన వైఫల్యానికి కొన్ని ఉదాహరణలు - ఏమంటే

యుసిఒసిని అమలు చేయడానికి స్థానిక సామర్థ్యం లేకపోవడం యుసిఒసితో విభేదించే స్థిరమైన స్థానిక నిర్ణయాలు ఉండడము యూసీవోసీ అమలు నిరాకరించడం వనరుల లేకపోవడం లేదా సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధి లేకపోవడం

  • వికీ లో (ఆన్-వికీ) సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు
    • బహుళ వికీలలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలు ఏ విధమైనవి అంటే: ప్రపంచ సిసోప్ లు, స్టీవార్డ్ లు, సింగిల్-వికీ యుసిఒసి ఉల్లంఘనలను నిర్వహించే సంస్థలు లేదా ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా లేని U4C లు నిర్వహించుతాయి
    • ఒకే వికీలో జరిగే సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను: ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు.
      • విధ్వంసం వంటి సాధారణ సార్వత్రిక ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలను ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాల ద్వారా నిర్వహిస్తారు, అక్కడ అవి ఈ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉండవు
  • వికీ బయట (ఆఫ్-వికీ) ఉల్లంఘనలు
    • స్థానిక పాలనా నిర్మాణం (ఉదా. ఆర్బ్కామ్)లేని చోట ఉనికిలో ఉన్న యు4సి నిర్వహిస్తుంది, లేదా కేసును అమలు నిర్మాణాల ద్వారా వారికి సూచించినట్లయితే, అది బాధ్యత వహిస్తుంది
    • కొన్ని సందర్భాల్లో, ఆఫ్-వికీ ఉల్లంఘనలను సంబంధిత ఆఫ్-వికీ స్పేస్ అమలు నిర్మాణాలకు నివేదించడం ఉపయోగం. ఇది ప్రస్తుతం ఉన్న స్థానిక ప్రపంచ అమలు యంత్రాంగాలను నివేదికలపై పనిచేయకుండా నిరోధించదు
  • వ్యక్తిగతంగా పాల్గొన్న కార్యక్రమాలు(ఈవెంట్లు), ప్రదేశాలలో ఉల్లంఘనలు
    • ఇప్పటికే ఉన్న అమలు నిర్మాణాలు తరచుగా ఆఫ్-వికీ ప్రదేశాలలో అనుసరించవలసిన ప్రవర్తన, నియమాలను అందిస్తాయి. వీటిలో ప్రదేశాలలో సమావేశాలలో అనుసరించవలసిన స్నేహపూర్వక విధానాలు, నియమాలు ఉన్నాయి.
    • ఈ కేసులను నిర్వహించే అమలు నిర్మాణాలు వాటిని యు4సికి సూచించవచ్చు
    • వికీమీడియా ఫౌండేషన్ నిర్వహించే కార్యక్రమాల సందర్భాల్లో, ట్రస్ట్ & సేఫ్టీ వారి కార్యక్రమ విధానాలను (ఈవెంట్ పాలసీ) అమలును అందిస్తుంది